TG: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో కొత్త జూ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో వంతారా బృందం MOU కుదుర్చుకుంది. ఇందుకు దాదాపు వెయ్యి ఎకరాలను ప్రభుత్వం.. వంతారా గ్రూపునకు కేటాయించే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లాలోని కడ్తల్, కురుమిద్ద, తాడిపర్తి గ్రామాల్లో అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. కాగా, గుజరాత్లో అంబానీకి చెందిన వంతారా జూ పార్క్ ఉంది.