SRD: మొదటి విడత జరిగే ఏడు మండలాల్లో పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో ప్రిసేడింగ్ అధికారులతో ఇవాళ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే సంప్రదించాలన్నారు.