బ్లైండ్ క్రికెటర్ దీపికకు సత్యసాయి జిల్లాలో ఘనంగా సన్మానం చేశారు. మడకశిర కాలేజీ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి సవిత, ఎమ్మెల్యేలు రాజు, పల్లె సింధూర దీపికను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు రూ.2లక్షల నగదు బహుమతిని మంత్రి ప్రకటించారు. కాగా, అంధ మహిళల టీ20 విభాగంలో మొట్టమొదటి ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు ఈమె కెప్టెన్‌గా వ్యవహరించారు.