SDPT: సీఎం రేవంత్ సిద్దిపేటకు వస్తే హరీశ్ రావు తట్టుకోలేడని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి పూజల గోపికృష్ణ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. హరీశ్ రావు సీఎంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. త్వరలోనే బీఆర్ఎస్ హయాంలో చేసిన అవినీతి, అక్రమాలు బయటపెట్టి హరీశ్ రావును జైలుకు పంపుతామన్నారు.