BHNG: ఆత్మకూర్ మండలంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సర్పంచ్ల గెలుపును కోరుతూ సోమవారం ప్రచారం నిర్వహించారు. మండలంలోని పల్లెర్ల, లింగరాజుపల్లి, రాఘవాపురం, పుల్లాయిగూడెం గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీ బలపరచిన సర్పంచ్ మరియు వార్డు మెంబర్ అభ్యర్ధులను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.