KMR: గ్రామాల్లో మరింత అభివృద్ధి కోసం కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పోతంగల్ సర్పంచ్ అభ్యర్థి గంధపు చైతన్య పవన్ కుమార్కు మద్దతుగా సోమవారం ఆయన గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలాలను సర్వే చేయించి ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు నిర్మాణాలు చేయించి ఇస్తామని అన్నారు.