ASR: అంతర్జాతీయ అండర్-19 క్రికెట్ టీ-20 ప్రపంచ కప్-2025 విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పాంగి కరుణకుమారిని సోమవారం పాడేరు కలెక్టరేట్లో కలెక్టర్ దినేష్ కుమార్ అభినందించారు. కరుణకుమారికి శాలువా కప్పి అల్లూరి సీతారామరాజు జ్ఞాపికను అందజేశారు. వంట్లమామిడికి చెందిన పీవీటీజీ గిరిజన కుటుంబంలో పుట్టి అంతర్జాతీయస్థాయిలో రాణించడం గొప్ప విషయమని కొనియాడారు.