కామారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మూడు దశలకు సంబంధించి మొత్తం 2,361 పోస్టల్ బ్యాలెట్ ఫార్మ్‌లు పంపిణీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ సోమవారం పేర్కొన్నారు. ఇందులో ఇప్పటివరకు 152 దరఖాస్తులు స్వీకరించినట్లు పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని ఆయన తెలిపారు.