TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో మహిళా సాధికారతను ప్రతిబింబించే ‘ఇందిరా మహిళా శక్తి’ స్టాల్ను మంత్రి సీతక్క ప్రారంభించారు. ‘మహిళ ఎదిగితే కుటుంబం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకే మా ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ స్టాల్లో కనిపిస్తున్న ప్రతీ విజయకథ మా తెలంగాణ మహిళల ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు నిదర్శనం’ అని పేర్కొన్నారు.