AP: విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేది లేదని చెబుతున్న బీజేపీ ప్రభుత్వం ప్లాంట్ను మెల్లగా అదానీ చేతిలో పెడుతోందని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందని అన్నారు. ఓ వైపు ప్రైవేటీకరణ లేదని చెబుతూ.. మరోవైపు చాపకింద నీరులా ప్రైవేటీకరణ వైపు పావులు కదుపుతోందని విమర్శించారు.