BDK: ఐటీసీ PSPD భద్రాచలం యూనిట్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. పేపర్, బోర్డు తయారీ ప్రక్రియలో వినియోగిస్తున్న ఆధునిక యంత్రాంగం, ఆటోమేషన్ టెక్నాలజీ, పర్యావరణ హిత తయారీ విధానాలను కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్లాంట్ కార్యకలాపాలలో నాణ్యత, భద్రత, పారిశ్రామిక ప్రమాణాల అమలుపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.