KMR: బాన్సువాడ మండలం కథలాపూర్లో వ్యవసాయ విద్యుత్ బిల్లులను ఒకే రోజు 100% వసూలు చేసినట్లు విద్యుత్ అధికారి అసిస్టెంట్ లైన్మెన్ రాథోడ్ రమేష్ తెలిపారు. ఇలా ఏక మొత్తంలో వసూలు చేయడం ఇది రెండవ సారి అని అన్నారు. పీఆర్ 102కు గాను రూ. 44,680 వసూలు అయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు అనిల్ కుమార్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.