బొద్దింకలు ఇంట్లోని గాలిని కలుషితం చేస్తాయని ఇటీవల ఓ పరిశోధనలో వెల్లడైంది. బొద్దింకల విసర్జితాల నుంచి వెలువడే ఎండోటాక్సిన్స్లో హానికారక బ్యాక్టీరియా ఉంటుందట. ఇది ఇంట్లోని దుమ్మూ, ధూళితో కలిసిపోయి గాలిని కలుషితం చేసి, అలర్జీలూ, ఆస్తమా, ఇతర శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తికి కారణం అవుతోందని చెబుతున్నారు. అందుకే వంటింటి నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.