GNTR: ANU పరిధిలో గత సెప్టెంబర్ నెలలో జరిగిన బీఫార్మసీ మూడవ సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. ఈ పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు 34.39% ఉత్తీర్ణత సాధించారన్నారు. రీవాల్యుయేషన్ కోసం ఈ నెల 19వ తేదీ లోపు రూ. 2,070 నగదు చెల్లించాలన్నారు.