ఇండిగో వ్యవహారంలో ప్రయాణికులకు మేలు జరిగేలా సమయస్ఫూర్తితో చర్యలు తీసుకున్నారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ వ్యవహారంలో మంత్రిత్వశాఖ వైపు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమయానుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. కొంతమంది తెలిసీ తెలియక చేస్తున్న విమర్శలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని సూచించారు.