NZB: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ విధుల్లో నిమగ్నమైన ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఎంపీడీవో కార్యాలయాలలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.