SKLM: ఎచ్చెర్ల మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు కొరకు రేపు అనగా మంగళవారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్టర్ అడ్డయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్, ఎంఈడిలలో ఈ ప్రవేశాలు ఉంటాయన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.