కృష్ణా: దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు విరాళాల రూపంలో సహాయం అందించేందుకు ముందుకు రావాలని కలెక్టర్ బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి కళ్యాణి ఆధ్వర్యంలో మచిలీపట్నం, పెడన మాజీ సైనికులు సమక్షంలో NCC సభ్యులు కలెక్టర్కు ఈరోజు వందనం చేశారు.