HYD: హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో భారత రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ సమాఖ్య (CREDAI) సభ్యులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు రాష్ట్ర అభివృద్ధికి కీలకమని, 1,000 మందికి పైగా ప్రపంచ పెట్టుబడిదారులు, పరిశ్రమల ప్రముఖులను ఆకర్షిస్తుందని క్రెడాయ్ ప్రతినిధులు తెలిపారు.