MNCL: భీమిని మండలంలోని పెద్దపేట గ్రామంలో అక్రమంగా విక్రయిస్తున్న గుడుంబాను పట్టుకున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు సోమవారం పెద్దపేట గ్రామ వాగు వద్ద గుడుంబా అమ్ముతున్న షేక్ ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకుని, 5 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.