తిరుపతి తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి సోమవారం నాగలాపురం విచ్చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆయనకు ఘన స్వాగతం పలికారు. నాగలాపురంలో రోడ్ల పరిస్థితిని ఆయనకు వివరించారు. అనంతరం అక్కడ నుంచి పిచ్చాటూరులో టూరిజం పనులు పరిశీలించేందుకు వెళ్లారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు పాల్గొన్నారు.