AP: విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్ ముట్టడికి నిర్వాసితులు ప్రయత్నం చేశారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే, స్టీల్ ప్లాంట్ బస్సులకు అడ్డుగా పడుకొని నిరసన తెలిపారు. దీంతో నిర్వాసితులను పోలీసులు బలవంతంగా లాగేశారు. ఈ క్రమంలో పోలీసులలో నిర్వాసితులు గొడవకు దిగారు.