ఇండిగో సంక్షోభం వేళ ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. పైలట్ల కొరతతో ఇండిగో విమాన సర్వీసులు కొన్నిరోజులుగా రద్దు అవుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పైలట్ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. B737, A320 విమానాల్లో పైలట్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.