MDK: మాసాయిపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు దొంతి ఆంజనేయులు ఇవాళ ఉదయం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లగా, గుర్తుతెలియని విషసర్పం కాటు వేసింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.