ADB: జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులు, పోలీసులు సూచనలు పాటించాలని SP అఖిల్ మహాజన్ తెలిపారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పోలీసుల తరఫున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అనుమతి లేకుండా అభ్యర్థులు ర్యాలీలు నిర్వహించవద్దన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిన, సోషల్ మీడియా రెచ్చగొట్టేలా పోస్టులు చేసిన చర్యలు తప్పవన్నారు.