SRD: సిర్గాపూర్ మండలం జమ్లాతాండ జీపీలో 5 వార్డులకు సింగిల్ నామినేషన్ రావడంతో 5 మంది ఏకగ్రీవమైనట్లు స్టేజ్ వన్ అధికారి నాగారం శ్రీనివాస్ తెలిపారు. వార్డు నంబర్ 1నుంచి 5వ వార్డు వరకు సభ్యులు రాథోడ్ అన్సిబాయి, మోతిబాయి, బులిబాయి, శంకర్ నాయక్, విస్లావత్ శంకర్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చెప్పారు. 6వ వార్డులో సంగ్రామ్, గురునాథ్ బరిలో ఉన్నారని చెప్పారు.