ములుగు NHM ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు నిలిచిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయని. సమస్య పరిష్కారానికి పలుమార్లు ప్రభుత్వాధికారుల కలిసినా స్పందన లేకపోవడంతో ఈనెల 6 నుంచి ఆన్లైన్ సేవలను నిలిపి, నల్ల బ్యాడ్జీలతో విధులు కొనసాగిస్తున్నారు. 3 నెలల జీతాలు విడుదల చేయాలని శరత్ కుమార్, సతీష్, నిఖిల్, ప్రవీణ్, దివ్య, తిరుపతి రెడ్డి, వజీరా, కిరణ్ తదితరులు డిమాండ్ చేశారు.