AP: పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం YCP రూ.9 వేల కోట్లు ఖర్చు చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే విద్యుత్ రంగాన్ని సమర్థంగా నిలబెడుతున్నాం. వచ్చే ఏడాది కూడా విద్యుత్ రంగంలో సమర్థత పెంచుకుంటాం. YCP పాలన దెబ్బకు ఏపీ బ్రాండ్ దెబ్బతిన్నది. అప్పుడే కొన్ని కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి’ అని పేర్కొన్నారు.