శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్ప పేట జిల్లా పరిషత్ హైస్కూల్లో సోమవారం అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోషకాహార పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. అక్షయపాత్ర ఫౌండేషన్ చేస్తున్న సేవలు నిజంగా ప్రశంసనీయమని ఆయన అన్నారు.