హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలోని బన్ను మానసిక వికలాంగుల కేంద్రంలో దివ్యాంగుల దినోత్సవం వేడుకలను కాకతీయ విశ్వ విద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనిత రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులకు ఏర్పాటు చేసిన ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. బన్ను సంస్థ నిర్వాహకులు కిరణ్ కుమారి పాల్గొన్నారు.