కరీంనగర్ పట్టణానికి చెందిన దేవేందర్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందారు. కరీంనగర్లోని గాంధీ చౌరస్తాలో మధ్యాహ్నం 12 గంటల వరకు డ్యూటీ చేసి ఇంటికి వెళ్లగానే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, దేవేందర్ అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు వెల్లడించారు. దీంతో పోలీస్ శాఖలో విషాదఛాయలు అలముకున్నాయి.