మహబూబాబాద్ జిల్లా అనంతారం చెరువులో మూడు రోజులుగా గల్లంతైన భూక్యా సాయికిరణ్ మృతదేహాన్ని ఇవాళ పోలీసులు, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు బయటకు తీశారు. చెరువు అడుగున ఒండ్రుమట్టి, తీగల్లో చిక్కుకున్న మృతదేహాన్ని ఎస్పీ డా. శబరీష్ పర్యవేక్షణలో జల్లెడ పట్టి వెలికితీశారు. మూడు రోజుల గాలింపు చర్యలకు ముగింపు పలుకుతూ ఘటన ప్రాంతంలో విషాదం నెలకొంది.