HYD: వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బాపూజీ నగర్లో పవిత్ర(18) అనే యువతిని సమీప బంధువైన ఉమాశంకర్ ఇంట్లోకి చోరబడి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఉమాశంకర్ తాగుబోతు కావడంతో అతడిని పెళ్లి చేసుకోవడానికి పవిత్ర నిరాకరించింది. దీంతో కక్షతో అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.