భారత రాజ్యాంగం ప్రవేశిక నుంచి లౌకికవాదం, సామ్యవాదం అనే పదాలను తొలగించాలని కోరుతూ రాజ్యసభలో ఒక ప్రైవేట్ బిల్లును BJP ఎంపీ భీంసింగ్ ప్రవేశపెట్టారు. అయితే ఇది అధికారిక ప్రభుత్వ బిల్లు కాదు. అయినప్పటికీ, ఈ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా జాతీయ స్థాయిలో చర్చ మళ్లీ మొదలవుతుంది. కాగా, 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం, లౌకికవాదం, సమగ్రత అనే మూడు కొత్త పదాలను చేర్చారు.