VZM: ఈనెల 10 నుంచి 21వ తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి సోమవారం తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.