BPT: ప్రభుత్వ 108 వాహనంలో డ్రైవర్ల పోస్ట్‌కు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. ఈనెల 10, 11న గొల్లపూడిలోని విజయవాడ భవ్య హెల్త్ సర్వీసెస్ ఆఫీస్ వద్ద ఇంటర్వ్యూ నిర్వహిస్తారని తెలిపారు. అభ్యర్థులు 10th పాసై, హెవీ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ఆసక్తి ఉన్న వారుపై తేదీలలో ఇంటర్వూకి హాజరుకావాలని సూచించారు.