TG: దేశంలో ఏ రాష్ట్రం చేయనివిధంగా రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించామని CM రేవంత్ రెడ్డి అన్నారు. 3 జోన్లను సేవ, తయారీ, వ్యవసాయ రంగాలకు కేటాయించామన్నారు. క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా పిలుచుకుంటున్నామని తెలిపారు. చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తిగా ముందుకెళ్తున్నామన్నారు. గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ 20 ఏళ్లలోనే అత్యధిక పెట్టుబడులు సాధించిందన్నారు.