NLG: దేవరకొండలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో 39వ మండల పూజ మహోత్సవ ఆహ్వాన పోస్టర్ రిలీజ్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఆలయ గౌరవాధ్యక్షులు చిలువేరు చంద్రమౌళి గురుస్వామి, అధ్యక్షులు పెండ్కర్ నాగేశ్వరరావు గురుస్వామి మాట్లాడుతూ.. ఈనెల 15న స్వామివారి అభిషేకం, 16న కుంకుమార్చన, స్వామివారి ఊరేగింపు, 17న మహా పడి పూజ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.