TG: హైదరాబాద్ నగరం తెలంగాణకే కాదు.. భారతదేశానికే ఆర్థిక నగరంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన.. కేంద్రం పాటిస్తున్న పారదర్శకత, జవాబుదారితనం వల్లే విదేశీ పెట్టుబడులు పెరిగాయన్నారు. గ్లోబల్ కంపెనీలకు డెస్టినేషన్ హబ్‌గా భారత్ మారిందన్నారు. సెల్ ఫోన్ల ఉత్పత్తిలో భారత్ ప్రస్తుతం రెండోస్థానంలో ఉందన్నారు.