NGKL: తెలకపల్లి మండలంలోని గోలగుండం గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి అవుతుందని ఎమ్మెల్యే అన్నారు. అంతకుముందు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు.