SRCL: వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. ధాన్యం నిలువలు పరిశీలించి, సేకరణ, తరలింపు గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ట్యాబ్ ఎంట్రీ, తదితర అంశాలపై ఆరా తీశారు.