GNTR: రాష్ట్రంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన జీరో పావర్టీ-P4 కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. బంగారు కుటుంబాల పరిస్థితులు, అవసరమైన సహాయంపై నిర్వహించిన సర్వే వివరాలను ఈ సందర్భంగా పరిశీలించారు. సమీక్ష సమావేశానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.