TG: తెలంగాణలో ఇప్పటికే అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టిందని కరణ్ అదానీ తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో మాట్లాడిన ఆయన.. రూ. 25 వేల కోట్లతో గ్రీన్ డేటా సెంటర్స్, రెన్యువబులు ఎనర్జీలో ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్నామన్నారు. సిమెంట్ రంగంలో కూడా అదానీ గ్రూప్ పెట్టుబడులు పెడుతోందన్నారు. దేశంలోనే తొలిసారిగా యూఏవీ టెక్నాలజీ HYDలో రూపొందిస్తున్నామన్నారు.