NZB: వేల్పూరు మండలం మోతె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సోమవారం ఐడీ కార్డులు అందించారు. పాఠశాలలోని విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఫోటో, పేరుతో కూడిన ఐడీ కార్డులను అందించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు హనీష్ కుమార్, రమేష్, శ్రీనివాస్, సుభాశ్రీ, విద్యా వాలంటీర్లు పాల్గొన్నారు.