వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌నకు సంబంధించి జియోహాట్‌స్టార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ అధికారిక ప్రసారకర్తగా వైదొలగాలని నిర్ణయం తీసుకుంది. వచ్చేఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.