NRML: పట్టణంలోని సెయింట్ థామస్ పాఠశాలలో ఈనెల 19, 20 తేదీలలో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్, ఇన్స్పైర్ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి భోజన్న, జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ వినోద్ కుమార్ సోమవారం తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు చెందిన 6-12 తరగతి విద్యార్థులు పోటీల్లో పాల్గొనవచ్చని సూచించారు.