JN: జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఇవాళ దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాల్లో ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్ స్క్రూటినీ ప్రక్రియను పరిశీలిస్తూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు కట్టుబడి పని చేయాలని అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్, సీసీ కెమెరాల ఏర్పాటుపై పలు సూచనలు ఇచ్చారు.