KRNL: పత్తికొండలో ప్రధాన రహదారుల్లో ఏర్పడిన గుంతలను ఏపీ రాష్ట్ర సీపీఐ నాయకులు రామచంద్రయ్య ఆధ్వర్యంలో మట్టితో పూడ్చి శ్రమదానం చేశారు. రాష్ట్రంలో గుంతరహిత రహదారులు అందిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరలేదని ఆయన వెల్లడించారు. గుంతల కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.