JGL: ప్రతి గర్భిణీ ప్రసవానికి ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆస్పత్రులల్లో మాత్రమే ప్రసవాలు చేసుకుని ప్రభుత్వాసుపత్రుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని పెగడపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ నరేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాలలో గర్భిణులకు ఏఎన్సీ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.