GNTR: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ తెనాలిలో కొనసాగుతోంది. బోసురోడ్డులోని పాత వీనస్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ శిబిరంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఛైర్పర్సన్ రాధిక, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని శివకుమార్ డిమాండ్ చేశారు.